పేరు : నీరజ్ చోప్రా వయస్సు : 24 సంవత్సరాలు
నీరజ్ చోప్రా హర్యానా రాష్ట్రం లోని, పానిపత్ జిల్లాలోని ఖంద్రా గ్రామంలో జన్మించారు.
నీరజ్ చోప్రా ఒలింపిక్స్ లో పురుషుల జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించిన తొలి ఆసియా క్రీడాకారుడు.
జావెలిన్ త్రో లో నీరజ్ మొట్ట మొదటి సారిగా 2016 సౌత్ ఆసియన్ లో బంగారు పతాకాన్ని సంపాదించారు.
2016 వ సంవత్సరంలో IAAF World U20 ఛాంపియన్ షిప్ లో మళ్ళీ బంగారు పతాకాన్ని కైవసం చేసుకున్నారు.
2017 లో Asian Athletic championships 2017 లో మళ్ళీ ఒకసారి బంగారు పతాకాన్ని సాధించారు.
2018 Commonwealth Games లో 86.47 మీటర్ల జావెలిన్ త్రో చేసి భారతదేశం పేరు కామన్ వెల్త్ గేమ్స్ లో మారుమోగించారు.
2021 లో జరిగిన ఒలింపిక్స్ లో బంగారు పతాకాన్ని కైవసం చేసుకున్నారు.
ఆగస్టు 26, 2022 వ సంవత్సరంలో జరిగిన లాసాన్ డైమండ్ లీగ్ లో 89.09m త్రో చేసి గెలిచారు.
భారత దేశం నుంచి ఈ లీగ్ గెలిచే మొట్ట మొదటి క్రీడా కారుడిగా చరిత్ర సృష్టించాడు.